27 July, 2026 | 9:27 PM

భవానీనగర్‌లో ఎట్టకేలకు సిమెంట్ రోడ్డు పనుల ప్రారంభం

27-07-2026 08:55 PM

ఉప్పల్,(విజయక్రాంతి): భవానీనగర్ కాలనీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. నిధులు మంజూరైనప్పటికీ గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానికులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన జోక్యంతో పాత టెండర్‌ను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు.

దీంతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కార దిశగా అడుగు పడటంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాగిరి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.