27 July, 2026 | 9:26 PM

ఎస్సీ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలి

27-07-2026 08:49 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని సాంఘీక సంక్షేమ హాస్టల్స్ లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కే వి పి ఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 వసతి గృహాలు నడుస్తున్నాయని ఇందులో కొన్ని అద్దె భవనాలలో ఇరుకు గదులలో కొనసాగుతున్నాయని, సరైన సౌకర్యాలు లేక  విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అధికారులు స్పందించి కనీస సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ రావు. సందీప్, నాయకులు ప్రవీణ్,వినోద్ పాల్గొన్నారు.