4 July, 2026 | 2:05 AM

పోర్టల్ ద్వారా 6 మొబైల్ ఫోన్లు రికవరీ

04-07-2026 01:25 AM

బోధన్, జూలై 3 (విజయక్రాంతి): బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 6 మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి, శుక్రవారం బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర రాజశేఖర్ మాట్లాడుతూ.. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, CEIR పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఫోన్ ఈఎంఐ నంబర్ను భద్రపరుచుకోవాలని, అపరిచితులకు OTPలు, బ్యాంక్ వివరాలు చెప్పి మోసపోవద్దని ఆయన సూచించారు.