4 July, 2026 | 2:24 AM

కస్తూర్బా గాంధీ విద్యార్థినులకు యూనిఫామ్స్, నోట్ బుక్స్ పంపిణీ

04-07-2026 01:27 AM

మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు

బాన్సువాడ, జూలై 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏకరూప దుస్తులు,నోట్ బుక్స్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కేజీవీబీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలతో పాటు అవసరమైన అన్ని సామాగ్రి ఉచితంగా అందిస్తోందని తెలిపారు.

విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయ గౌడ్, కేజీవీబీ స్పెషల్ అధికారిని విజయలత గారు, గ్రామ సంఘం అధ్యక్షురాలు నసిమా, ఏపియం నాగరాజు, సీసీ అమ్రృత, సాయిలు పాఠశాల ఉపాధ్యాయినిలు, సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.