29 June, 2026 | 2:03 AM

రిక్రియేషన్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం

29-06-2026 12:00 AM

సుల్తానాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,  ఎన్నికల ప్రక్రియను ఏ. బుచ్చిరెడ్డి, అబ్దుల్ ఖాలీక్ ల ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో క్లబ్‌ఉపాధ్యక్షులుగా ఏ. రామేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎం. రవీందర్, గేమ్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా డి. రమేష్, ఆర్థిక కార్యదర్శిగా వై. శ్రీధర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎం. రాజేంద్ర ప్రసాద్, డి. దామోదర్ రావు, వీ. రామ్మూర్తి, కే. మైసయ్య, ఎం. ప్రవీణ్ కుమార్, వి లక్ష్మణ్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన ఉపాధ్యక్షుడు ఏ. రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యులకు ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాలను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.