29 June, 2026 | 2:01 AM

పల్స్ పోలియో విజయవంతం

29-06-2026 12:00 AM

కేసముద్రం, జూన్ 28 (విజయక్రాంతి): పల్స్ పోలియో కార్యక్రమం కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. కేసముద్రం పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంతో పల్స్ పోలియో కార్యక్రమం సందడిగా మారింది.