యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జాతీయ రహదారిపై ధర్నా
చేగుంట ఆగస్ట్ 27,విజయక్రాంతి: చేగుంట పోలీస్ స్టేషన్ పరిదిలోని మాసాయిపేటలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జాతీయ రహదారి-44పై రైతులు ధర్నాకు దిగారు. ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యాప్లో నమోదు చేసిన గంటలోపే యూరియా స్టాక్ అయిపోయిందని, షాప్ యజమాని చెబుతున్నారని, సర్వర్ సమస్యలతో చదువురాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కనీసం ఒకటి, రెండు యూరియా బస్తాలైనా దొరికేవని, ఇప్పుడు ఒక్క బస్తా యురియా దొరకడం లేదని పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డీ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి, త్వరలోనే యాప్ లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు కి యూరియా వచ్చేటట్లు చూస్తానని చెప్పడంతో రైతులు శాంతించి రాస్తారోకో విరమించారు.






