9 March, 2026 | 9:19 AM

కేపీహెచ్బీ ఫేజ్-6లో అగ్నిప్రమాదం

08-03-2026 04:35 PM

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-6లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టాడంతో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ దుకాణానికి మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఎంటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.