5 July, 2026 | 9:35 PM

మహాశివరాత్రికి ఎర్రచీర

24-12-2024 12:00 AM

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టున్‌మెంట్స్ బ్యానర్‌పై -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర ది బిగినింగ్’. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న ‘ఎర్రచీర ది బిగినింగ్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

అయితే రిలీజ్‌ను వాయిదా వేశారు. డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో శివరాత్రి సమయంలో విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలోనే శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. ఈ సినిమాలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.