శంబాలలో సైకిల్‌పై..
ఆది సాయికుమార్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘శంబాల’. ప్రేక్షకులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని ఆది సాయి కుమార్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవాళ ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘శంబాల’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సైకిల్ మీద హీరో మంటల్లోంచి రావడం.. మరోవైపు ఆకాశం ఎరుపెక్కి కనిపిస్తుంది. దీనిని చూస్తుంటే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ‘శంబాల’లో ఆది సైంటిస్ట్‌గా నటిస్తున్నాడు. అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.






