మాట నిలబెట్టుకున్న రెడ్డిపల్లి సర్పంచ్
అమ్మ పుణ్యవతి తల్లి దీవెన పథకం చెక్కును అందజేసిన సర్పంచ్ షాపురం రాజు
మొయినాబాద్, జూన్ 8 (విజయ క్రాం తి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భా గంగా రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ షాపురం రా జు మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అమలు చేస్తున్న అమ్మ పుణ్యవ తి తల్లి దీవెన పథకం కింద నూతనంగా జ న్మించిన శిశువు కుటుంబానికి ఆర్థిక సహా యం అందజేశారు.
గ్రామానికి చెందిన కుం డే శేఖర్‌శ్వేత దంపతులకు మగబిడ్డ జన్మించ గా, సర్పంచ్ షాపురం రాజు వారి నివాసాని కి వెళ్లి రూ.11,000 విలువైన ఏడవ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ షా పురం రాజు మాట్లాడుతూ, గ్రామపంచాయ తీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర కు గ్రామంలో జన్మించే ప్రతి శిశువు కుటుంబానికి అమ్మ పుణ్యవతి తల్లి దీవెన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు.
గ్రామ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న సర్పంచ్ షాపురం రాజును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.






