10 June, 2026 | 2:52 AM

మిస్టరీగా మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు

10-06-2026 12:23 AM

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏసీపికి ఎమ్మార్పీఎస్ నాయకుల ఫిర్యాదు

చేవెళ్ల జూన్ 9 (విజయక్రాంతి): మే నెల 17 రాత్రి కనకమామిడి రెవిన్యూలో వ్యాస్ కుమార్ కు చెందిన వ్యాన్ ఫామ్ హౌస్ లో మసీదు బండకు చెందిన కొందరు వ్యక్తులు బర్త్డే పార్టీ జరుపుకున్నారు.ఆ పార్టీలో ఉన్న వ్యక్తి కోడిచెర్ల సాయి కుమార్ అనే వ్యక్తి అ నుమాస్పదంగా మృతి చెందాడు. ఘటన జ రిగి 20 రోజులు గడిచిన పోలీస్ లు ఎవరిని అరెస్టు చేయకపోవడంతో మృతుని భార్య మొనిక, తల్లి లక్ష్మి తరపున  కుటుంబానికి చెందిన బంధువులు ఎమ్మార్పీఎస్  నాయకులు మంగళవారం చేవెళ్ల ఏసిపి కిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

వెంటనే నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యా యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు నరేందర్ మాదిగ,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శివ శంకర్ మాదిగ,చేవెళ్ల మండల అధ్యక్షులు ఊరెంట ప్రవీణ్ మాదిగశేర్లింగంపల్లి అధ్యక్షులు నరేష్ మాదిగ, ప్రేమ్ కుమార్ మాదిగ,నగేష్ మాదిగ, రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.