16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలి!

14-02-2026 12:00 AM

తెలంగాణలో రైతులు క్రిమిసంహారకాలను మితిమీరి వినియోగిస్తున్నారని పలువురు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.  తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు క్రిమిసంహారకాల వినియోగం కూడా భారీగా పెరుగుతోందని వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా పురుగుల మందులు వాడడం ద్వారా నేలసారం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది.

చేలకు కొద్దిపాటి చీడ, పీడల లక్షణాలు కనిపించిన వెంటనే పెస్టిసైడ్స్ కంపెనీలకు పరిగెడుతున్న రైతులు షాపు యాజమానులిచ్చే క్రిమిసంహారాలను పంటలపై చల్లుతున్నారు. ఫలితంగా రైతుకు అనవసర డబ్బు ఖర్చుతో పాటు పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పంట చేలకు దగ్గరగా ఉండే చెరువులు కూడా విషపూరితమవుతున్నాయి. క్రిమిసంహారకాల వినియోగం పెరిగిన కొద్దీ పంట దిగుబడులు తగ్గడంతో పాటు నేలసారం కూడా దెబ్బతింటుంది.

సాగులో క్రిమిసంహారకాల వినియోగాన్ని తగ్గించి సహజసిద్దమైన సాగు విధానాలను అవలంభిస్తూ నేల భూసారాన్ని పరిక్షిస్తూ, పేడ, పశువుల ఎరువు వేసవిలో కుప్పలుగా పోయాలి. క్రిమిసంహారకాల వినియోగాన్ని 90 శాతం తగ్గించి వ్యవసాయం చేయొచ్చు. తద్వారా భూసారాన్ని కాపాడడంతోపాటు రైతులకు పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

అయితే పురుగుమందుల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు పీఎం ప్రమాణ్ పేరుతో ప్రత్యామ్నాయ పోషకాల వినియోగాన్ని సాగులో ప్రోత్సహించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసినా ఆ పథకం రైతుల వద్దకు చేరడం లేదు. ఇకనైనా వ్యవసాయ అధికారులు క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి.

 జ్ఞానేందర్, నిజామాబాద్