14-02-2026 12:00:00 AM
నేను చిత్తూరు జిల్లాలోని శివగిరి క్షే త్రం దర్శిస్తానని గాని, అక్కడ ప ది రోజులు ఉపనిషత్తుల మీద ప్రసంగిస్తానని కానీ ఎన్నడూ అనుకోలేదు. శివగిరి అనేది అరగొండకు సమీపంలో ఒక ఎత్తున కొండమీద ఉంది. అక్కడి క్షేత్రస్వామి దక్షిణామూర్తి. సమీప గ్రామాల నుంచి భక్తు లు ప్రతిరోజు వచ్చి స్వామికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వ్యాసాశ్రమానికి అనుబంధంగా ఉన్నదే ఈ శివగిరి క్షేత్రం. అప్రమేయానంద స్వామి ఈ క్షేత్రం బాగోగులు చూసుకుంటారు.
మళయాల స్వా మి ముఖ్య శిష్యుల్లో విద్యానందగిరి స్వామి ఒకరు. గురువు ఆదేశంతో విద్యానందగిరిస్వామి శివగిరి క్షేత్రాన్ని స్థాపించి అక్కడ మూడు దశాబ్దాల పాటు తపస్సు చేశాడు. నేను శివగిరి క్షేత్రానికి వెళ్లినప్పుడు, విద్యానందగిరిస్వామి శిష్యులు ఎనభై ఏళ్లకు పైబడిన వారు నా ప్రసంగాన్ని వినడానికి రావడం విశేషం.
మఠంలో పరిచయం..
ప్రస్తుతం వ్యాసాశ్రమ పీఠాధిపతిగా శ్రీ పరిపూర్ణానందగిరిస్వామి ఉన్నారు. మలయాళ స్వాముల వారి శిష్యులకు శిష్యులు వారు. వ్యాసాశ్రం బాగోగులు చూస్తూ, శిష్యకోటికి ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తున్న పరిపూర్ణానందగిరిస్వామి సత్వగుణ సంపన్నులు. కోపం, తాపం (దుఃఖం) ఎరుగని వారు. నిత్య సంతోషి అని ఒక మాటలో చెప్పవచ్చు.
వారితో నాకు పరిచయం గాం ధీనగర్ (హైదరాబాదు)లోని మలయాళస్వాముల వారి మఠంలో కలిగింది. అక్కడి కి వారు విచ్చేసినప్పుడు, నేను ఉపనిషత్తు ల మీద ప్రసంగించాను. అది వారిని బా గా ఆకట్టుకుంది. తదాదిగా వ్యాసాశ్రమం నుంచి వెలువడే ‘యాథార్థభారతి’ పత్రికలో ఉపనిషత్తుల మీద వ్యాసాలు ప్రచు రితమవుతున్నాయి. నా వ్యాసాలు చదివిన వారు తరచుగా నాకు ఫోను చేసి మాట్లాడుతుంటారు.
నన్ను స్వయంగా చూడా లని వారి కోరిక. ఆ కారణంగా క్రిష్ణాజిల్లా, కంకిపాడు మండలంలోని గొడవర్రు గ్రామంలో చాతుర్మాస్యం సందర్భంగా నేను పదిరోజులు పది ఉపనిషత్తుల మీద ఉపన్యసించడం జరిగింది. 2024 ఆగస్టు నెలలో నేను ఉపన్యసించిన తర్వాత, వ్యాసాశ్రమ భక్తులు చిత్తూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా నన్ను కోరారు.
చిన్ననాటి సంఘటన..
పరిపూర్ణానందగిరిస్వామి నన్ను ఎప్పు డు వస్తారని పదేపదే అడిగారు. కానీ తీవ్రమైన చలి కారణంగా నేను ఒక తేదీ చెప్పి, దాన్ని దాటవేశాను. భక్తుల ఒత్తిడికి పరిపూర్ణానందగిరిస్వామి లొంగిపోయారు. నేను రైలు టికెట్టు కూడా రద్దు చేసుకోవడం వారికి బాగనిపించలేదు. అనుకోకుండా వారు హైదరాబాదులోని ‘కోటి దీపోత్స వం’ కార్యక్రమానికి వచ్చారు. వారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను ప్రత్యక్షంగా టీవీలో చూశాను. ఆరోజు రాత్రి పది గంటలవుతుంది. నాకు వారు స్వ యంగా ఫోను చేశారు.
‘ఉదయం ఆరు గంటలకు మీ ఇంటికి వస్తున్నాను. మీరు సిద్ధంగా ఉండండి. మీతో పాటు చిత్తూరుకు రావడానికి’ అని చెప్పారు. కానీ నా సమాధానం ఏమిటని వారు అడక్కుండా నే ఫోను పెట్టేశారు. అంత పెద్దమనిషి, ఆశ్రమ పీఠాధిపతులు ఫోను చేశారంటే అది ఎంతో గౌరవంగా భావించాలి కదా! ఆశ్చర్యంగా వారు స్వయంగా ఉదయం 5 గంటలకే మా ఇంటికి విచ్చేశారు. నేను గబగబా కాలకృత్యాలు తీర్చుకొని ఒక బ్యాగు లో రెండు జతల బట్టలు తీసుకొని వారి తో పాటు కారెక్కాను. అప్పుడు నాకు నా చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది.
ఎంతైనా న్యాయమూర్తి కదా!
నేను గౌలిపురాలో ఉన్నప్పుడు తెలవారుతుండగా, నాకు సమీపంలో ఉన్న గుం డేరావు హర్కారే నా గదికి కట్టె పట్టుకొని వచ్చారు.‘మీరు కష్టపడి రావాలా? కబురు చేస్తే నేనే వస్తుంటి కదా’ అని అన్నాను. అప్పుడు వారన్న మాటలు నాకిప్పటికీ గు ర్తున్నాయి. ‘మన పని ఉన్నప్పుడు, మనం ఎంత గొప్పవారమైనా, ఇతరుల సాయమపేక్షించినప్పుడు స్వయంగా వారి దగ్గరకి వెళ్లడమే న్యాయం’ అన్నారు వారు. ఆయ న 30 సంవత్సరాలపాటు న్యాయమూర్తిగా నిజాం ప్రభుత్వంలో విధులు నిర్వర్తిం చారు. ఎంతైనా అలాంటి న్యాయమూర్తి నోట న్యాయపూరితమైన మాటలే వస్తా యి కానీ, భిన్నమైనవి రావు కదా! ఒక్కసారిగా పరిపూర్ణానందగిరి స్వామి నా దగ్గరికి రావడం ఆశ్చర్యాన్ని మాత్రమే కాదు, ఆనందాన్ని కలిగించింది.
కారులో పక్కపక్కనే ఇద్దరం కూర్చున్నాం. ఎన్నో వేదాంత విషయాలు మా మాటల మధ్య దొర్లాయి. పన్నెండు సంవత్సరాల వయస్సు నుంచే వైరాగ్య బీజాలు తన హృదయక్షేత్రంలో ప డడానికి మలయాళ స్వాముల వారే కారణమని చెప్పారు. బ్రహ్మచర్యం నుంచి సం న్యాసాశ్రమంలో ప్రవేశించడానికి మలయాళస్వామి వారి శిష్యులైన విద్యానందగి రి స్వామివారి ఉపదేశమే కారణమట! మ హాత్ముల ఉపదేశాలు వ్యర్థము కావు కదా!
తిరుపతిలో జోరు వర్షం..
అట్టి విద్యానందగిరి స్వాములవారు తపస్సు చేసిన చోట పదిరోజుల పాటు ఉపనిషత్తుల మీద ఉపన్యసించే భాగ్యం నాకు కలిగింది. చివరిరోజు ఉపన్యాసం ముగించుకొని మధ్యాహ్నానికి కడపకు చేరుకున్నాం. అక్కడ ఒక శిష్యుని ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాను. నాకు సేవ చేయడానికి స్వామి వెంకటేశం అనే శిష్యుణ్ణి కడ ప నుంచి శివగిరి క్షేత్రానికి రమ్మన్నాడు. నేను శివగిరి క్షేత్రంలో ఉన్న 10 రోజులు వెంకటేశం నాకెంతో సేవ చేశారు. ఉపనిషత్తుల మీద ఉదయం, సాయంత్రం ఉప న్యాసాలు సాగేవి.
ఆ గుట్ట మీదికి పరిసర ప్రాంతాల నుంచి స్త్రీలు కూడా నా ఉపన్యాసం వినటానికి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడున్న పది రోజులు పరిపూర్ణానందగిరి స్వామి కూడా ప్రసంగించారు. ప్రశాంతమైన వాతవరణంలో జరిగిన ఆ భక్తి కార్యక్రమం నాకెంతో తృప్తి ని కలిగించింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు నాకు చివరి ప్రసంగం రోజు దక్షిణలు కూడా సమర్పించుకున్నారు.
కార్యక్ర మానంతరం అసంగానందగిరి నన్ను హైదరాబాదుకు పంపించడానికి ఫ్లుటై టికెట్ కొన్నారు. కానీ తిరుపతికి వస్తున్న సమయంలో విపరీతమైన వర్షం కురిసి విమానాలు రద్దయ్యాయి. చివరికి రైళ్లో ఎంతో కష్టపడి హైదరాబాదుకు రావలసి వచ్చింది. అన్నివేళలు మనవి కావు కదా? పరిపూర్ణా నందస్వామి మా ఇంటికి వచ్చి నన్ను స్వయంగా తీసుకొని వెళ్లడం వల్ల శిష్యుల కోరిక గురువులకు కూడా అనుల్లంఘనీయమేనని అర్థమైంది.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప