14-02-2026 12:00:00 AM
దేశ పాలనలో ఒక ప్రమాదకరమైన తత్వం బలపడిపోయింది. అధికారానికి సంబందించిన ఖాళీలు అత్యవసరం, ప్రజల జీవితాలకు సంబంధించిన ఖాళీలు ద్వితీయమైనవి. ఒక ప్రజా ప్రతినిధి మరణించినా లేదా రాజీనామా చేసినా ఆరు నెలలలోపే స్థానాన్ని భర్తీ చేయాలని రాజ్యాంగంలో ఉంటుంది. పాలకులు కూడా దీనిని ప్రజాస్వామ్య రక్షణగా పేర్కొంటారు. కానీ ప్రజాస్వామ్యానికి మూలాధారమయిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆధ్యాపకుల ఖాళీలు ఎందుకు భర్తీ చే యడం లేదన్నది ప్రశార్థకంగా మారింది.
నిరుద్యోగుల గోడు ప్రభుత్వం పట్టించుకోదా? గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ఉండరు. ఆసుపత్రుల్లో డాక్టర్లు కనిపించరు, కోర్టుల్లో న్యాయ సహాయకులు అందుబాటులో ఉండరు. ఇది ప్రజాస్వామ్య విలువల పతనమని చెప్పొచ్చు. ప్రభుత్వాలు జీడీపీ గురించి గొప్పగా మాట్లాడతాయి. ప్రజలకు ఉపాధి లేకుండా, కొనుగోలు శక్తి లేకుండా, సరైన ఆర్థిక భద్రత లేకుండా ఏ దేశం నిజంగా అభివృద్ధి చెందలేదు. తె
లంగాణలో బీఆర్‌ఎస్‌ను పడగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘లక్ష ఉద్యోగాల భర్తీ’ అని ఊదరగొట్టింది. కానీ వరుస ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న సాకుతో నియామకాలు పక్కనబెట్టింది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో అన్ని ఎన్నికలు పూర్తవనున్నాయి. దీంతో ఉద్యోగాలను భర్తీ మాటను నిలుపుకుంటుందా లేక తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా చూడాలి.
నవనీత, రామాయంపేట