13 July, 2026 | 2:55 PM

ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు

02-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 1: దేశంలో ఉత్పత్తయ్యే ముడి చమురుపై కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. టన్ను క్రూడాయిల్‌పై పన్నును రూ.9,600 నుంచి రూ.8,400కు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తుందన్నది. దేశంలో ఉత్పత్తి చేసే ముడిచమురు, విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ల ద్వారా కంపెనీలకు ఒనగూడే భారీ లాభాలపై కొంత శాతం పన్నుగా వసూలు చేయడానికి 2022 జూలై నెలలో ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని ప్రతీ పక్షం రోజలకోసారి సమీక్షించి మార్పులు చేస్తున్నది. స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) రూపంలో ఈ పన్నును విధిస్తున్నారు. తాజాగా డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై జీరో ట్యాక్స్‌నే కేంద్రం అట్టిపెట్టింది.