మౌలిక రంగాల వృద్ధి 5.2 శాతం
02-05-2024 12:00 AM
న్యూఢిల్లీ, మే ౧: దేశంలో 8 కీలక మౌలిక రంగాలు ఈ ఏడాది మార్చి నెలలో 5.2 శాతం వృద్ధిచెందినట్టు తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రూడాయిల్, సిమెంట్, విద్యుత్ రంగాలు మంచి పనితీరును కనపర్చడంతో 8 కీలక రంగాల ఉత్పత్తి మొత్తంగా 2024 మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే పెరిగింది. కానీ ఈ ఏడాది సాధించిన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే తక్కువగా ఉన్నది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ కీలక మౌలిక రంగాల వృద్ధి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7.8 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. మార్చి నెలలో ముడి చమురు ఉత్పత్తి 2 శాతం పెరగ్గా, సిమెంటు ఉత్పత్తి 10.6 శాతం, విద్యుదుత్పత్తి 8 శాతం చొప్పున పెరిగాయి.






