27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

ఐద్వా నూతన సభ్యత్వాల నమోదు

01-03-2026 07:45 PM

- జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల

కోనరావుపేట,(విజయక్రాంతి): ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని కోనరావుపేట మండలంలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఒక్కరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల స్థానిక కార్యకర్తలతో కలిసి మహిళలను ఐద్వాలో నూతన సభ్యులుగా నమోదు చేశారు. ఈ సందర్భంగా జవ్వాజి విమల మాట్లాడుతూ... మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దాడులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.

మహిళలకు పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ, వారికి రక్షణ కల్పించే దిశగా ఐద్వా ఉద్యమాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిలక నరసవ్వ, పూజ నరసవ్వ, శీతల రేణుక, అవని నరసవ్వ తదితరులు పాల్గొన్నారు. మహిళల హక్కులు, భద్రత కోసం ఐద్వా చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములవాలని వారు పిలుపునిచ్చారు.