1 March, 2026 | 9:26 PM

జెడ్పి డిప్యూటీ సీఈఓకు పదవీ విరమణ సన్మానం

01-03-2026 07:41 PM

దోమకొండ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓగా పనిచేసిన కే రాజ్ వీర్ నకు ఆదివారం దోమకొండ సర్పంచ్ ఐరేణి నర్సయ్య, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ పదవీ విరమణ సన్మానం చేశారు. డిచ్ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహించి, గత నాలుగు రోజుల క్రితం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందారు.  వీడీవోగా ఉద్యోగంలో చేరి, అంచెలంచెలుగా జెడ్పి డిప్యూటీ సీఈఓ వరకు సేవలందించారని వారన్నారు.

ప్రభుత్వ పథకాలు అమలు, ప్రజా సేవలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. గ్రామం నుండి జిల్లా స్థాయి అధికారిగా ఎదగడం గ్రామానికే గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మర్రి శేఖర్, నేతుల సుధాకర్, అబ్రబోయిన రాజేందర్, పిన్నెం రామచంద్రం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.