గాజా బందీలను వెంటనే విడిచిపెట్టండి
లేకుంటే తీవ్ర పరిణామాలు
హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
న్యూయార్క్, డిసెంబర్ 3: ఇజ్రాయెల్-హమాస్ మధ్య తారాస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తమ వద్ద బందీలుగా ఉన్న వ్యక్తుల వీడియోను హమాస్ ఇటీవల విడుదల చేసి న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ హమాస్ మిలిటెంట్ సంస్థపై మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టకముందే గాజా బందీలను విడిచిపెట్టాలని, లేదా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తన ట్రూ త్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ‘2025, జనవరి 20న నేను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తా.
ఈలోపు మీవ ద్ద బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టం డి. లేనిపక్షంలో చరిత్రలో కనీవిని ఎరుగుని రీతిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సా మ్ బ్రిగేడ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలగ్జాండర్ తమ బాధ లను వివరించాడు. 420 రోజులుగా నర కం అనుభవిస్తున్నామని పేర్కొన్నాడు. ఈ వీడియోపై ఎడాన్ తల్లి స్పందిస్తూ ఎడాన్‌తో పాటు బందీల విడుదల విషయంలో ప్రధాని నెతన్యాహు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.






