13 July, 2026 | 12:53 PM

పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఆందోళన.. రెండు పార్టీలు దూరం

03-12-2024 01:21 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఇండియా కూటమి నేతలు ఆందోళనకు దిగారు. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్ లో అదాని వ్యవహారం, యూపీలోని సంభల్ అల్లర్లు తదితర అంశాలపై ప్రతిపక్షాలు సభలో చర్చించాలని పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలు గత వారమంతా స్తంభించాయి. చివరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యంతో మంగళవారం ఉభయ సభలు సజావుగానే ప్రారంభమయ్యాయి. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీలోని విపక్షాలు ఆందోళనకు దిగాయి. పార్టమెంట్ ఆవరణలో విపక్ష ఇండియా కూటమి నేతలు మోదీ, అదాని  ఒకటే అంటూ పోస్టర్ల ప్రదర్శన చేశారు.

అదాని గ్రూప్ అవినీతి అంశంపై పార్లమెంట్లో చర్చించాలని నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రతిపక్షాల ఆందోళనలతో వాయితా పడుతున్న ఉభయ సభలు మంగళవారం కొనసాగుతున్నాయి. అయితే, ఇందులో టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొన్నాకుండా సభ కార్యకలాపాలను కొసాగిస్తున్నారు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పార్లమెంట్ సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని తృణమూల్ నేతలు చెబుతున్నారు.