calender_icon.png 11 June, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావుకు ఊరట

10-06-2025 12:26:37 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకు ఊరట లభించింది. హరీష్‌రావు విషయంలో వేసిన ఎన్నికల పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ లో హరీష్ రావు(Harish Rao) తప్పుడు వివరాలు ఇచ్చారని చక్రధర్‌గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు కోట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు హరీష్‌రావు తరుఫున వాదనలు వినిపించారు.