10-06-2025 12:37:34 PM
హైదరాబాద్: లింగంపల్లి నుంచి విశాఖపట్నం(Lingampalli to Visakhapatnam) వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్( Janmabhoomi Express) ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో అనూహ్యంగా నిలిచిపోయింది. రైలు దాదాపు గంటసేపు అలాగే ఉండిపోవడంతో ప్రయాణీకులకు ఇబ్బంది కలిగింది. సమీపంలోని నడికుడి జంక్షన్(Nadikude Junction) నుండి వెంటనే ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను పంపించారు. ఆ తర్వాత రైలు విశాఖపట్నం వైపు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ సమస్య మరింత అంతరాయం లేకుండా పరిష్కరించబడిందని, ప్రయాణీకులకు భద్రత, నిరంతర పర్యవేక్షణకు హామీ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు.