2 August, 2026 | 1:34 AM

హైకోర్టు తీర్పుతో విద్యార్థులకు ఊరట

02-08-2026 12:26 AM
  1. సర్టిఫికెట్లు అట్టి పెట్టుకున్న కాలేజీలు 
  2. ఫీజు రీయంబర్స్మెంట్ రానందున డబ్బులు చెల్లించాలని డిమాండ్ 
  3. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన యాజమాన్యాలు 
  4. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లేఖ రాసినా డోంట్ కేర్ 

మేడ్చల్, ఆగస్టు 1(విజయ క్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని విద్యార్థుల సర్టిఫికెట్లు అట్టి పెట్టుకోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు తీర్పు ఇవ్వడం వేలాదిమంది వృత్తి విద్యా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఊ రట కలిగిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ రా నందున డబ్బులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేయడమే గాక, డబ్బులు చెల్లి స్తేనే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తామన్న కాలేజీ యాజమాన్యాలకు ణాలను చెంపపెట్టు అయింది.

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన ఒక విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, రూ. మూడు లక్షలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో ఆ విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కాలేజీ యాజమాన్యాన్ని మందలించడమే గాక వా రం రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక ఒరిజినల్ సర్టిఫికెట్లపై వి ద్యార్థికి తప్ప ఎవరికీ అధికారం లేదని స్పష్టం చేసింది.

ఇది ఒక విద్యార్థి, ఒక కాలేజీకి సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలో ని అన్ని కాలేజీలు ఇలాగే బ్లాక్మెయిలింగ్ చే స్తున్నాయి. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రా ష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో సగానికి పైగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే ఉ న్నాయి. ప్రతిసారి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు. 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం 

వాస్తవానికి వృత్తి విద్యా కాలేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాయి. ఒరి జినల్ సర్టిఫికెట్లు అట్టిపెట్టుకొని బ్లాక్మెయిలింగ్ కు పాల్పడ్డాయి. ఫీజు రియంబర్ సి మెంట్ రానందున డబ్బులు చెల్లిస్తేనే ఒరిజినల్ ఇస్తాం అనడంతో విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్లడానికి, స్థానికంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేరడానికి సర్టిఫికెట్లు అవసరమయ్యాయి. తమ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామ ని బతిమిలాడిన యాజమాన్యాలు పట్టించుకోలేదు. మీ ఉపాధి మీరు చూసుకుంటున్నా రు, మేము కాలేజీలు ఎలా నడపాలి అం టూ సమాధానం ఇచ్చారు. సర్టిఫికెట్లు లేక చాలామంది విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోయారు. 

ఉన్నత విద్యా మండలి చైర్మన్ లేఖ రాసిన డోంట్ కేర్ 

ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి నియంత్రణలో పనిచేస్తాయి. ఫీజు ల నియంత్రణ, ప్రవేశాలు, అకాడమిక్ మార్గదర్శకాలు పర్యవేక్షిస్తుంది. అలాంటి అధికా రాలు ఉన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ లేఖ రాసినప్పటికీ ఒక కాలేజీ యాజమా న్యం పట్టించుకోకపోవడం గమనార్హం. గతం లో బాచుపల్లి లోని ఒక పేరొందిన ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఫీజు రియంబ ర్స్మెంట్ రాలేదని ఒక విద్యార్థిని సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నిరాకరించింది.

ఆ విద్యార్థినికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాలంటే సర్టిఫికెట్లు అవస రం. దీంతో విద్యార్థిని తండ్రి ఉన్నత విద్యా మండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన లేఖ రాశారు. ఆ లేఖ చూసిన యాజమా న్యం ఇలాంటి లేఖలు చాలా వస్తాయి, డ బ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ఆ విద్యార్థిని తండ్రి అప్పుచేసి రూ. లక్ష చెల్లించగా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చారు. 

మల్లారెడ్డి విద్యాసంస్థలకు రెండోసారి

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మైకు పడితే వేలాదిమంది విద్యార్థులను ఏఐలు తయారు చేస్తున్నానంటూ గొప్పలు చెబుతారు. కానీ ఆయన కాలేజీలో కూడా విద్యార్థులను ఫీజు విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేగాక ఆయన విద్యాసంస్థలకు న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయడం రెండోసారి. గత నెలలో కూడా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జరిమానా విధించింది. ఒక విద్యార్థి 2021లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.

ట్యూషన్ ఫీజు రూ. 80000 చెల్లించాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చదు వుకొని సాధించలేకపోయాడు. తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని యాజమా న్యాన్ని కోరగా డబ్బులు ఇస్తేనే ఒరిజినల్స్ ఇస్తామనడంతో ఆ విద్యార్థి వినియోగదారుల పోరా న్ని ఆశ్రయించాడు. ఒరిజినల్ సర్టిఫికెట్ లేనందున నాలుగేళ్లు నష్టపోయాడు. గత నెలలో వినియోగదారుల ఫోరం కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడ మే కాక రూ. లక్ష జరిమానా విధించింది. దీ నితోపాటు రూ. 10000 కోర్టు ఖర్చుల కిం ద విద్యార్థికి చెల్లించాలని ఆదేశించింది.