14 April, 2026 | 4:19 AM

చలివేంద్రాలతో ప్రజలకు ఉపశమనం

14-04-2026 12:57 AM

నాగోల్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మన్సూరాబాద్ డివిజన్లోని సహారా స్టేట్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ , మేడ్చల్ రూరల్ జిల్లా ప్రభారీ సామ రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకు లు, కార్యకర్తలు  కాలనీవాసులు పాల్గొన్నారు.