అమీన్‌పూర్‌లో ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు
03-09-2024 01:17 PM
సంగారెడ్డి: జిల్లాలోని అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో హైడ్రా సూచనల మేరకు రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేతలు నిర్వహిచారు. ఫ్యూజన్ అతర్జాతీయ పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఆక్రమణలను హైడ్రా, రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. సర్వేనంబర్ 119లోని అక్రమ కట్టడాలతోపాటు అక్రమంగా వేస్తున్న వెంచర్ లోని ప్లాట్లను బీసీబీలతో తొలగించారు. 15 గుంటాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా, రెవెన్యూ, పోలీసు అధికారు సమక్షంలో కూల్చివేతలు నిర్వహించారు. కిష్టారెడ్డి పేట్ లోని 164 సర్వే నంబర్ లోని అక్రమకట్టడాల కూల్చివేతలకు సిద్దమవుతున్నారు.






