4 May, 2026 | 8:42 AM

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

03-09-2024 01:01 PM

ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇట్టివల ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన ఇద్దరు తండ్రి మోతీలాల్, కుమార్తె అశ్విని వరదలో కోట్టుకుపోయి చనిపోయ్యారు. అయితే ముఖ్యమంత్రి  మంగళవారం  వరదలో చనిపోయిన మృతుల కుటుంబాలకు పరామర్శ తెలిపారు.

మోతీలాల్ కుటుంబాన్ని పరామర్శించని రేవంత్ రెడ్డి, మంత్రులు మోతీలాల్ కుమారుడికి ఉద్యోగం అంశం పరిశీలిస్తామని, మృతుని ఇంటి నిర్మాణానికి సహాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు. ఖమ్మంలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి ఉన్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ కు సీఎంతో కలిసి మంత్రులు బయలు దేరారు.