30 June, 2026 | 10:08 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు

17-04-2026 07:58 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్ ఎర్రగుంట స్మశాన వాటికలోని  పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి తన సొంత ఖర్చులతో  జెసిబి ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు కోట్ల వ్యయంతో ఎర్రకుంట స్మశాన వాటిక వైకుంఠ దామాగా నిధులు మంజూరు అయి ఉన్నాయని, ఎండిపోయిన పిచ్చి చెట్లు మట్టి కుప్పలుతో ప్రజలు స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.

స్మశాన వాటిక నూతన కమిటీ స్థానికులు తెలిపారని దీంతో తన సొంత ఖర్చులతో స్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలను మట్టికుప్పలను తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలోనే అధికారులు వైకుంఠధామ నిర్మాణ పనులు  చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  సాయిజెన్ శేఖర్ స్మశాన వాటిక నూతన కమిటీ అధ్యక్షులు మూర్తి నాగరాజు ఎడ్ల కార్తీక్ కొమ్మ గళ్ళ కౌశిక్ మనోజ్ సందీప్ పాల్గొన్నారు.