30 June, 2026 | 9:21 PM

Breaking News

మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం

17-04-2026 08:00 PM

ఉప్పల్,(విజయక్రాంతి): సిపిఐ ఉప్పల్ మండల్ కార్యదర్శి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద  బిజెపి ఎంపీ తేజశ్రీ సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై  చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. వేలాదిమంది తమ జీవితాలను త్యాగం చేసి  తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే బిజెపి నేతలు ఆ త్యాగాన్ని హేళన చేయడం సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. బిజెపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు