కాలె యాదయ్య హటావో.. కాంగ్రెస్ బచావో
గాంధీభవన్ ముందు కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. కాలె యాదయ్య హటావో.. కాంగ్రెస్ పార్టీ బచావో అంటూ నియోజకవర్గంలోని దాదాపు వందమంది కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా, కనీసం కాంగ్రెస్ కండు వా కూడా కప్పుకోవడంలేదని అన్నారు. గత ప్రభుత్వంలో భుజాలు కాయలు కాసినా కాం గ్రెస్ జెండాను మోశామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనేక నిర్బంధాలు, రౌడీ షీట్ కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు.
ఆనాడు బీఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, ఎన్నో దాడు లు చేయించారని మండిపడ్డారు. ఈ రోజు కాం గ్రెస్ కార్యకర్తల కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇదిలా ఉంటే కాలె యా దయ్య గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తరవాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగలు తగులుతున్నాయి.






