రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు
* నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి
* బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి
గరిడేపల్లి,(విజయక్రాంతి): రాయినిగూడెం గ్రామంలోని బీజేపీ కార్యాలయం వద్ద జెండా దిమ్మను పక్కకు జరిపి, జెండా రాడ్డును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడంతో పాటు గ్రామంలోని బీజేపీ జెండాలను తొలగించడాన్ని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆమె ఎస్ఐ గోపిరెడ్డిని కలిసి సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల బిక్షమయ్య, కుక్కడపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






