1 April, 2026 | 6:48 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

పగిలిన నీటి పైప్ కు మరమ్మత్తులు చేపట్టాలి

01-04-2026 04:48 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పగిలి వృధాగా పోతున్న నీటి పైపుకు మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ అధికారులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగరావు డిమాండ్ చేశారు. ఘట్ కేసర్ సర్కిల్ పోచారం  డివిజన్ పరిధిలోని కొర్రెముల అంబేద్కర్ నగర్  లో ప్రధాన రహదారి పక్కన ఉన్న త్రాగునీటి సరఫరా మ్యానువల్ వద్ద పైప్ లైన్ పగిలి 10 రోజులుగా నీరు వృధాగా పోతున్నదని ఈ విషయాన్ని స్థానిక సర్కిల్ కార్యాలయంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలే వేసవికాలం నీళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు. అధికారుల నిర్లక్ష్యం వల్ల త్రాగునీరు వృధాగా పోతున్న పరిస్థితి వెంటనే పగిలిన నీటి పైపులకు మరమ్మత్తులు చేయగలరని ఆయన డిమాండ్ చేశారు.