1 April, 2026 | 6:42 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ వేడుకలు

01-04-2026 04:51 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం పడిపూజ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగ  నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ వేడుకలతో పాటు స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

అంతకు ముందు  హోమం  జరిగింది. ఆలయ నిర్వాహకులు మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి పద్మ మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గురుస్వామి మిట్టపల్లి మురళీధర్, ఆలయ అర్చకులు గూడ రమేష్ శర్మ, సాయినాథ్ శర్మ లు స్వామివారి అభిషేకం పడిపూజ వేడుకలను ఘనంగా జరిపారు.

ఇందులో  మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ సమత, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ మారవేణి లచ్చయ్య, డీలర్  వెంకన్న,  పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు , భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే నీరుకుల్లా రోడ్ లోని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అభిషేకం హోమాలు ఘనంగా నిర్వహించారు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఆలయ అర్చకులు సద్దనపు రవీంద్ర చారి, ఆలయ నిర్వాహకులు  బుచ్చిరెడ్డి , శంకరయ్య పలువురు పాల్గొన్నారు.

సిఐ, ఎస్ఐ లకు సన్మానం

అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగిన పడిపూజ వేడుకల్లో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ లు పాల్గొనగా ఆలయ నిర్వాహకులు, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్ పద్మ దంపతుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న) పలువురు పాల్గొన్నారు.