27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

డంప్ యార్డ్ కి వ్యతిరేకంగా విద్యార్థుల మానవహారం

01-04-2026 04:46 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి వద్ద ఏర్పాటు చేసే డంప్యాడ్ను వ్యతిరేకిస్తూ ప్రవేట్ పాఠశాలల యజమాన్యాలు, విద్యార్థులు  బుధవారం నిరసనవ్యక్తం చేశారు. పట్టణ కూడలల్లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని,మనోజ్ కుమార్  వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు హానిచేసే ఏ ప్రాజెక్టులకైనా వ్యతిరేకమని, పార్టీలకతీతంగా ఉద్యమం కొనసాగించాలన్నారు. డంపింగ్ యార్డ్ తో లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. డంప్యాడ్ పై ఇప్పటికే, మంత్రి పొన్నం ప్రభాకర్కి వినతి పత్రం   అందజేశామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డంపు యార్డును ఆపేందుకు  కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  రవీందర్రావు, బండ అనుష, కాళీ క్ హుస్సేన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రవేట్ పాఠశాల యజమాన్యాలు, ప్రజాసంఘాల నాయకులు తో పాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.