13 March, 2026 | 8:04 PM

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌కి వినతి

13-03-2026 07:17 PM

హుజురాబాద్,మర్చి13: (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలో సిరిసపెల్లి గ్రామ ప్రాంతంలో ఏర్పడే డంపింగ్ యార్డును రద్దు చేసే విధంగా  మున్సిపల్ పలకవర్గం తీర్మానం చేయాలని గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసినికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హనుమకొండ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ ను అక్కడ ప్రజల వ్యతిరేకించడంతో హుజురాబాద్ ప్రక్కన నెలకొల్పాలన ప్రభుత్వం తెరపైకి తెచ్చింది అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకోవచ్చారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంటెండర్లకు ఆహ్వానిస్తున్నారని అన్నారు. డంపింగ్ యార్డ్ హుజురాబాద్ లో ఏర్పడితేచుట్టుపక్కల గ్రామాలు రైతులు, ప్రజలకు అన్ని రకాల రోగాలు ప్రబలించే ప్రమాదం ఏర్పడి ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని, హుజరాబాద్ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలంటే మున్సిపల్ పాలకమండలి డంపింగ్ యార్డ్ ను రద్దు రద్దు చేసే విధంగా ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపించాలని విజ్ఞప్తి చేశారు.