పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత
గ్రామంలో సైడ్ కాలువల పూడికతీత పనులు
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తీగలవాయి గ్రామంలో శుక్రవారం వారం సైడ్ కాలువలు పూడికతో నిండిపోయిన సైడ్ కాలువలను శుభ్రం చేసే పనులు చేపట్టారు. 11వ వార్డు సభ్యులు శాంత-నరసింహారావు ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిటమట రఘు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కాలువల పూడికతీత పనులను చేపట్టినట్లు వారు తెలిపారు. కాలువలను పూర్తిగా శుభ్రం చేయడంతో నీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. కాలువల శుభ్రపరిచే పనులు అద్భుతంగా నిర్వహించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ప్రజలు కోరారు.




