ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వినతి
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ భీమ్లా నాయక్ కు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిలభారత విద్యార్థి పరిషత్ మండల కన్వీనర్ విశ్వంత్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చూస్తున్నందున రాష్ట్రములో 12 వేల కోట్ల బకాయి ఉన్నందున రెండు లక్షల మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.
మరో నాలుగు లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్య కోసం పక్క రాష్ట్రాలకు పోవలసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యార్థుల పిజ్ రియిన్బర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని కళాశాల ప్రాంగణాలు విశ్వవిద్యాలయాలు ఉద్యమ వేదికలుగా మారుతాయి అన్నారు.






