13 March, 2026 | 3:08 PM

కొత్త రైలు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి వినతి

13-03-2026 01:53 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): న్యూఢిల్లీ పార్లమెంట్ భవనంలో శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister of Railways Ashwini Vaishnaw)ను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు కలిసి చర్లపల్లి నుండి సిర్పూర్ కాగజ్‌నగర్, నాగపూర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును నడపాలని వినతిపత్రం అందజేశారు.

కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, చంద్రాపూర్, బల్లార్షా, నాగపూర్ ప్రాంతాల్లో నివసిస్తున్న బెంగాలీ ప్రజల సౌకర్యార్థం ఈ కొత్త రైలును మంజూరు చేస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను కూడా కలిసి కొత్త రైలు ప్రతిపాదనను సమర్పించినట్లు చెప్పారు.ఈ ప్రతిపాదనపై త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.