కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
బిఆర్ఎస్ లో భారీ చేరికలు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు.శుక్రవారం నివాసం వద్ద వాంకిడి మండలం బెండర గ్రామానికి చెందిన పలువురు ఆ పార్టీ మండల అధ్యక్షుడు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా తప్పుకున్నారు.
ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు.రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్,వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారం,అఖిల గాండ్ల తేలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు హివ్రే సందీప్, టిఆర్ఎస్వి నాయకుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




