calender_icon.png 7 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సమ్మిట్ రోల్ మోడల్‌గా నిలుస్తుంది

07-12-2025 01:28:16 AM

-అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ

-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

-ఏర్పాట్లను పరిశీలించి అనంతరం అధికారులతో సమావేశం

రంగారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచ ర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం కందు కూరు మండ లం ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, హౌసిం గ్ మరియు సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ కు దేశ,విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించామన్నారు. గడచిన రెండు సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతోపాటు 2037 విజన్, 2047 విజన్ ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించబోతున్నా మన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచ నలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.గడువులోగా పూర్తి స్ధాయి ఏర్పాట్లకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రా న్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం నాయకత్వం లో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ది సాధించా లనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. 

సమ్మిట్‌పై ‘ఇండిగో’ ప్రభావం ఉండదు

సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూపదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఎప్పటికప్పుడు వచ్చే అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశీలిస్తున్నారని చెప్పారు. మంత్రి పొంగులేటి వెంట ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.