calender_icon.png 19 January, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు ఖరారు

19-01-2026 12:00:00 AM

  1. కొందరికి మోదం.. మరికొందరికి  ఖేదం

కొందరికి కలిసి వచ్చిన అవకాశం మరికొందరికి చేజారిన అవకాశం 

కామారెడ్డి జిల్లాలో బల్దియా రిజర్వేషన్ల తీరు 

కామారెడ్డి, జనవరి 18 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలు ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ స్థానాలకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకుల ముందు డ్రా తీసి రిజర్వేషన్లను ఖరారు చేశారు. కౌన్సిలర్ గా పోటీ చేయాలని ఎన్నో కలలు కన్నా కొందరికి కలలు కలలుగానే మిగిలిపోయాయి. అనుకూలంగా రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

మరికొందరికి అనుకోకుండా అవకాశం రిజర్వేషన్ రూపంలో కలిసి వచ్చినవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు జనరల్ అభ్యర్థులు తమకు రిజర్వేషన్ వస్తే తాం పోటీ చేస్తామని బీసీ రిజర్వేషన్ వస్తే మద్దతు ఇస్తామని చెప్పడంతో కొందరికి రిజర్వేషన్ కలిసి రాగా మరికొందరికి రిజర్వేషన్ మిస్సయ్యారు. దీంతో రిజర్వేషన్ల కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్ల కస్రతులు కొందరికి మోదం కలగగా మరికొందరికి కేదం మిగిలింది.

ఆశలు ఆవిరి 

ఎన్నో ఏళ్లుగా కౌన్సిలర్ గా పోటీ చేస్తామని ఆశ పెట్టుకున్నావారికి రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఆశలు ఆవిరయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పోటీలో ఉండేందుకు ఓటర్ల కు పోటీలో ఉంటానని తనకే మద్దతు ఇవ్వాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న వారికి రిజర్వేషన్లు అనుకూలంగా రాక ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్ చేజారే పోటీ చేసేందుకు అవకాశం లేక పోయిందంటూ కొందరు ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ నేతల ప్రసన్నం కోసం చక్కర్లు

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వార్డుల వారిగా ప్రభుత్వం ఖరారు చేయడంతో మున్సిపల్ చైర్మన్ గా,కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేతలు ఆయా పార్టీల ముఖ్య నేతల అండ దండల కోసం చక్కర్లు కొడుతున్నారు. పార్టీ బీఫారం అందుతేనే పోటీ చేస్తే తమకు గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్న ఆశావహులు ముఖ్య నేతల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద మున్సిపాలిటీలు స్థానిక ఎమ్మెల్యేల అండదండలు ఉన్నవారికి కాంగ్రెస్ టికెట్లు వస్తాయని భావిస్తున్న ఆశావాహులు ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కామారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆశీస్సుల కోసం కాంగ్రెస్ అభ్యర్థులు బి ఫామ్ కోసం చక్కర్లు కొడుతున్నారు. బిఆర్‌ఎస్, బిజెపి నేతలు సైతం జిల్లా అధ్యక్షుల ఆశీస్సుల కోసం తాపత్రయపడుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిజెపి ఎమ్మెల్యే ఉండడంతో ఆయన ఆశీస్సులు ఉంటేనే బిజెపి బీఫామ్ టికెట్ లభిస్తుందన్న ఆశతో బిజెపి శ్రేణులు ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి వద్దకు వచ్చి తాము పోటీల్లో ఉంటామని ఆశవాహూలు చెపుతున్నారు. తమకు బీఫామ్ ఇస్తే గెలిచి వస్తామని తమకే బీఫామ్ ఇచ్చి సహకరించాలని కోరుతున్నారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు తమకు బి ఫామ్ అందితే చాలు గెలిచి వస్తామని ఆశావాహులు చెబుతున్నారు. 

పార్టీలకసరత్తు 

ఎవరికి బీఫామ్ ఇస్తే గెలిచి వస్తారు ఏమి ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఏమి మైనస్ పాయింట్ లు ఉన్నాయి అనే విషయాలను ఆయా పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఆశావహులు వార్డుల వారీగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. తమకు బీఫామ్ వచ్చేవరకు  చక్కర్లు కొట్టాల్సేoదేనని పలువురు ఆశావాహులు చెబుతున్నారు. 

రిజర్వేషన్లు ఖరారు కావడంతో  కసరత్తులు షురూ 

పార్టీ నేతలు మున్సిపల్ చైర్మన్ కు, వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలిచే అభ్యర్థుల కోసం పార్టీ నేతలు వేట షూరువు చేశారు. ఇతర పార్టీలో ఉన్నవారు గెలిచే అవకాశం ఉంటే తమ పార్టీలోకి తీసుకొని పోటీల్లో నిలిపాలని ప్రయత్నాలు షురూ చేశారు.

తమ పార్టీలోకి వస్తే బీఫామ్ ఇచ్చి గెలిపిస్తామంటూ కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే గెలిచే అభ్యర్థుల వివరాలు సేకరించి తమ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంచి పార్టీలో తమ పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నారు. ఆశావా హూలు దరఖాస్తు చేసుకుంటే కసరత్తు చేస్తామంటూ చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు షురూ చేశారు.