18-01-2026 09:49:20 PM
కోదాడ: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతిని శనివారం కోదాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అడా హాక్ కమిటీ సభ్యులు ఓరుగంటి ప్రభాకర్ పార్టీ నాయకులతో కలిసి ఖమ్మం క్రాస్ రోడ్ లో మున్సిపాలిటీ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పట్టణ పార్టీ అధ్యక్షుడు ఉప్పగండ్ల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏటుకూరి రామారావు, సీనియర్ నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు గుళ్లపల్లి సురేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఉప్పగండ్ల శ్రీనివాసరావు, మోతే మండల పార్టీ అధ్యక్షులు కోడె వాసు, ఏటుకూరి సురేష్, కోదాడ రేవంత్ రెడ్డి, సైదయ్య గౌడ్, కొదటి గురవయ్య, గంధం రామకృష్ణ, ముండ్ర రవికుమార్, షేక్ హబీబ్, ఏడుకొండలు, బాబా షర్ఫుద్దీన్, సజ్జ రామ్మోహన్, వనపర్తి నాగేశ్వరరావు, కొత్త రాంబాబు, చావ హరినాథ్ పాల్గొన్నారు.