లేబర్ కోడ్స్ రద్దుకై... ఉవ్వెత్తున ఉద్యమిద్దాం
మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకై పోరాడుదాం అని లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుదామని హెచ్చరించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్లో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి శివ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమక్షంలో శుక్రవారం వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శివ బాబు మాట్లాడుతూ... కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని కనీస వేతనం రూ.26000 అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 16న రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిర్వహించే మహా ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాములు, వెంకటమ్మ, గణేష్, తిరుపతయ్య, రామచందర్, ప్రకాష్, లక్ష్మీ, కమల, శాంత, ఉపేంద్ర, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




