13 June, 2026 | 7:32 PM

‘రోజ్ గార్ దివస్’తో ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం

13-06-2026 05:59 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ‘రోజ్ గార్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాజంపేట గ్రామ సర్పంచ్ పోచయ్య తెలిపారు. శనివారం పంచాయితీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద తొలి ‘రోజ్ గార్ దివస్’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కూలీల సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చలు జరిపి పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.

రాజంపేట నూతన పంచాయితీగా ఏర్పడిన నేపథ్యంలో ఇది తొలి సమావేశమని పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, గ్రామంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యుడు జావిద్, పంచాయతీ సిబ్బంది సంతోష్, ఈజీఎస్ సిబ్బంది రమేష్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.