13 June, 2026 | 7:27 PM

నిర్మల్ లో కంటి ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి

13-06-2026 06:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో, కూచాడి శ్రీహరి రావు తల్లిదండ్రులు సత్యమ్మ–ప్రకాశ్‌రావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కూచాడి సత్యమ్మ–ప్రకాశ్‌రావు కంటి పరీక్ష కేంద్రంను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. క్లిష్టమైన నేత్ర సమస్యలకు హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వేణుగోపాలచారి  ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఎల్‌వీ ప్రసాద్ ప్రతినిధులు పాల్గొన్నారు.