అంత్యక్రియలకు ఆర్థిక సాయం
ఓ పోలీస్ కానిస్టేబుల్ ఔదార్యం
కామారెడ్డి,(విజయక్రాంతి): పోలీస్ అంటేనే ధైర్యం. ఏ ఆపదొచ్చిన మొదటగా గుర్తుచేది పోలీసులే. ఆ పోలీసులకు మానవత్వం తోడైతే.. ఏ పేదవాడికి కన్నీరు ఉండవు అని చెప్పేందుకు జుక్కల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ నిదర్శనం. మాచారెడ్డి మండలంఎల్లంపేట పక్క గ్రామం పందిమడుగు తాండకు చెందిన భూక్యా శ్రీను మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించనీ పరిస్థితి నెలకొంది.
విషయం తెలుసుకున్న ఎల్లంపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రీను నాయక్ అంత్యక్రియలకు రూ. 5వేల ఆర్థిక సాయం అందించి.. ఆ కుటుంబానికి కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు. మృతి చెందిన శ్రీను భార్య జున్ను, ఇద్దరు కుమారులైన మహేందర్, వీరేందర్ లకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన కానిస్టేబుల్ శ్రీను నాయక్ ను స్థానికులు, నాయకులు అభినందించారు.






