స్కూల్ ముంపు సమస్య పరిష్కారానికి రూ.50 లక్షలు
03-08-2026 03:33 PM
ఉప్పల్,(విజయక్రాంతి): హెచ్‌ఎంటీ నగర్ డివిజన్‌లోని జాన్సన్ గ్రామర్ స్కూల్ వద్ద ముంపు సమస్య పరిష్కారానికి సుమారు రూ.50 లక్షల అభివృద్ధి ప్రతిపాదనలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆమోదం తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవతో నాలా డీసిల్టింగ్, భారీ పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో వర్షాకాలంలో తరచూ ఎదురవుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.






