ప్రభుత్వం మారింది.. స్తూపం నిర్మాణం ఆగింది
03-08-2026 03:37 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట గతంలో నిర్మించ తలపెట్టిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం పనులు అర్ధాంతంగా నిలిచిపోయాయి. గతంలో స్థూపం నిర్మాణం వేగవంతంగా చేపట్టిన మధ్యలోనే నిలిపివేసి స్థూపం నిర్మాణం మరిచిపోయినట్టున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అమరుల స్మారక స్థూపాన్ని మరిచిపోయారని స్థానికులు అంటున్నారు. అమరుల త్యాగఫలంతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో స్థూపం నిర్మాణం మరిచిపోవడం పట్ల పలువురు అధికారుల తీరును విమర్శిస్తున్నారు.






