1 April, 2026 | 1:58 AM

పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించండి

01-04-2026 12:25 AM

విద్యాకమిషన్ మెంబర్‌కు సర్పంచ్ వినతి

కడ్తాల్, మార్చి 31: కడ్తాల్ మండలంలోని సరికొండ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత మరియు ప్రైమరీ పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని కోరుతూ గ్రామ సర్పంచ్ అద్దాల మహేందర్ గౌడ్, రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం  హైద రాబాద్లోని ఆయన కార్యాలయంలో సర్పం చ్ మర్యాదపూర్వకంగా కలిసి పాఠశాలల స్థితిగతులను వివరించారు.

విద్యార్థులు ఇ బ్బందులు పడకుండా మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.వినతిపై సానుకూలంగా స్పందించిన చారగొం డ వెంకటేష్, త్వరలోనే స్వయంగా పాఠశాలలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సత్యం గౌడ్, సురేష్ బాబు పాల్గొన్నారు.