1 April, 2026 | 2:00 AM

మహాలక్ష్మి ద్వారా రూ.10వేల కోట్లు ఆదా

01-04-2026 12:26 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం

బాన్సువాడ, మార్చి 31 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూపాయలు 10000 కోట్లు ఆదా అవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు,10,000కోట్లు ఆదా చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలకు ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరైయ్యారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 09 తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా బాన్సువాడ డిపో నుండి మహాలక్ష్మి పథకం ప్రారంభమయిన నుండి 30 మార్చి 2026 వరకు ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికులు 2.42 కోట్లు కాగా ప్రయాణికులు ఆదా చేసుకున్న మొత్తం రూపాయలు 90.32 కోట్లని వివరించారు. రూ 10000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పలువురు మహిళలను పోచారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో డిపో మేనేజర్ రవికుమార్ కాంగ్రెస్ నాయకులు ఎర్వల కృష్ణారెడి, జంగం గంగాధర్, నార్ల రవీందర్, ఎజాజ్ రోహిత్‌ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.